ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 24 : ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, కలెక్టర్ బోరడ హేమంత్, ఎస్పీ సురేశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో డిపోలో అందుబాటులోకి వచ్చిన లహరి, రాజధాని, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను డిపో మేనేజర్ శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన లహరి బస్సు ఏసీ కోచ్‌గా ఉందని, ఇందులో స్లీపర్ క్లాస్ సౌకర్యం ఉందన్నారు.
అనంతరం డిపో మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ డిపోకు రెండు లహరి బస్సులు, ఒక ఎక్స్ ప్రెస్ వచ్చిందని తెలిపారు. లహరి బస్సులను హైదరాబాద్‌కు నడిపిస్తామని, స్లీపర్ కోచ్ కోసం ఒకొకరికీ రూ. 1240, సీటు బుకింగ్ కోసం రూ. 850 ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు శ్యామ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీఆర్ఎస్ యువ నాయకుడు సాయినాథ్, నాయకులు సతీష్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.