చింతలమానేపల్లి : యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎస్సై ఇస్లావత్ నరేష్ (SI Naresh) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శుక్రవారం శివ రామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలోని యువకులకు వాలీబాల్ కిట్టును ( Volleyball kit ) అందచేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు, వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని, క్రీడల వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో శివ రామసాయి యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్, కుమ్రం పరదేశి, జాగరి శ్రీశైలం, విలాస్, జుమిడి సాగర్ , దినేష్, సంతోష్, మున్నాభాయ్, నగేష్, హరీష్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.