మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల ( Manchiryal) జిల్లా కేంద్రంలోని కుర్మపల్లి ఏరియా నంన్నూర్ ప్రాంతానికి చెందిన ఎలిగేటి నాగరాజు (30) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు. మృతి చెందిన యువకుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ ఫైనాన్స్ ప్రైవేట్ కంపెనీ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన ఘటన వద్ద యువకుడి బైక్ పార్క్ చేసి ఉందని వివరించారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినామని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.