బజార్ హత్నూర్: మండలకేంద్రానికి చెందిన సుకుల్ తరుణ్ సింగ్ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న ఘటన శుక్రవారం బజార్ హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఏఎస్సై లింబాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బజార్ హత్నూర్( Bajarhutnoor Mandal ) గ్రామానికి చెందిన సుకుల్ తరుణ్ తన ఇంటి నుంచి బహిర్భూమికి వెళ్లి ఇంటి సమీపంలో చెరువు గట్టుపై పురుగుల మందు తాగి పడి పోయాడు. గమనించిన కుటుంబికులు వెంటనే అతడిని ప్రాథమిక దవఖానాకు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 108లో జిల్లా కేంద్రం లోని రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించారు.
మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తండ్రి ప్రేమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.