భైంసా, ఏప్రిల్ 16 ః సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో భైంసా ఆర్టీసీ డిపో ముందు గురువారం సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 2021, 2025 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ కుమార్, గంగయ్య, బండారి సాయన్న, గజ్జారాం, ముత్యం, రాణి, విజయలక్ష్మీ, నిరోష పాల్గొన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 16 ః ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పొందుపరిచిందని, అమలు చేయకుండా మోసం చేసిందని ఆర్టీసీ జేఏసీ తెలంగాణ వైస్ చైర్మన్ మారంరెడ్డి థామస్‌రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిషరించాలని నినాదాలు చేశారు. హకుల సాధన కోసం ఈనెల 22 నుంచి సమ్మెను చేపట్టనున్నట్టు వెల్లడించారు. జేఏసీ నాయకులు, కార్మికులు ఏఆర్ రెడ్డి, గంగధార్, ఈవీఆర్ కిషాన్, లింగన్న, ఆర్ఎన్ రావు, రమేశ్, సంజీవ్‌రావు, రాజు, సవిత, అనిత పాల్గొన్నారు.