‘పోస్టాఫీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలి’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం పోస్టాఫీస్‌లో గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
– సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న
దమ్మపేట, జూలై 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామం పోస్టాఫీస్‌లో గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత తపాలా శాఖ ప్రజలకు అనేక రకాల పొదుపు, బీమా, ఆర్థిక సేవలను అందిస్తోందని తెలిపారు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), టైమ్ డిపాజిట్ (టీడీ), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) వంటి పథకాల ద్వారా ప్రజలు భద్రంగా పెట్టుబడులు పెట్టి మంచి ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.
అదేవిధంగా ఆధార్ సేవలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు, నగదు లావాదేవీలు, మనీ ట్రాన్స్ఫర్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ వంటి సేవలను కూడా పోస్టాఫీస్ ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రజలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో అప్పారావు గ్రామ సర్పంచ్, చాప రాఘవయ్య మాజీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మాలోత్ రాంబాబు, టి.గిరిబాబు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఎన్.శ్రీను, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, పోస్టాఫీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

