ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 3 : రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్ అన్నారు. కార్మిక శాఖ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో)ఆధ్వర్యంలో శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో పత్తి సరఫరా ప్రకియలో పని వద్ద ప్రాథమిక సూత్రాలు, హక్కులను ప్రోత్సహించడం అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. అనంతరం ఏఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… బాల కార్మిక వ్యవస్థ నిషేధం, బాలకార్మిక వ్యవస్థ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో పోలీసు శాఖ కీలకపాత్ర పొషిసున్నదన్నారు. అనంతరం సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి బాలకార్మికుల పునరావాసం , బాలకార్మిక వ్యవస్థను ని ర్మూలనకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత, అసిస్టెంట్ కమిషనర్ శ్రావణి, ఎల్ఏవోలు వినోద్, రాజలింగు, జగదీశ్‌రెడ్డి, అధికారులు, వ్యాపారులు ఉన్నారు.