ఖానాపూర్ రూరల్, మే 10 : తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సంఘ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. రైతు సమస్యలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయని ధాన్యాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం కొంటున్నదన్నారు. ధాన్యాన్ని విక్రయించడానికి ప్రతి గ్రామానికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, నాయకులు అంబటి చంద్రయ్య, తూము చరణ్, నామెడ ధర్మరాజు, కొప్పుల రాజేశ్వర్, కరిపె శ్రీనివాస్, పుప్పాల గజేందర్, పెద్దిరాజు, దాసరి మల్లయ్య, ఎల్లయ్య, బక్కన్న, ఐకేపీ సీసీ రాజేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొండుకూర్‌లో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
కడెం, మే 10: మండలంలోని కొండుకూర్ పంచాయతీలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రూ.లక్ష అందజేశారు. ఈ కార్యక్రమానికి కొండుకూర్తో పాటు, సమీప గ్రామాల ప్రజలు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోళ్ల వేణుగోపాల్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ప్రభుత్వం
ఉట్నూర్ రూరల్, మే 10 : మండలంలోని దంతన్‌పెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సూరం లచ్చన్న ఇటీవల అనారోగ్యంతో మృ తిచెందగా.. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. పులిమడుగు మాజీ సర్పంచ్ ఆడే దత్త్తా రాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆరోగ్య పరిస్థితిని అడితెలుసుకున్నారు. కొత్తగూడ గ్రామానికి చెందిన కామెరి పోశన్న కుమారుడి వివాహవేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సాలేవాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు సింగారే భరత్ అన్న కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, లక్కారం ఉప సర్పంచ్ కోల సత్తన్న, సల్గర్ రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.