కాసిపేట, జూన్ 22 : తాగు నీటి కోసం తండ్లాడుతున్నా పట్టించుకోరా.. అంటూ కాసిపేట మండలం దేవాపూర్కు చెందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో ఆదివారం దేవాపూర్లోని ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. పక్షం రోజులుగా గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఎమ్మెల్యే స్పందించి తాగు నీరందించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోర మండల అధ్యక్షుడు అట్కపురం రమేశ్, మహిళలు జయ, నర్సమ్మ, పుష్పలత, స్వప్న, లావణ్య, రజిని, కుంద, జ్యోతి, రాజమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.