ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 24 : బెల్ట్ షాపులు ఎత్తివేయాలని వాంకిడి మండలం గోయగాం గ్రామానికి చెందిన మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్‌లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
వారు మాట్లాడుతూ గోయగాం గ్రామంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారని, యువత మద్యానికి బానిసై తరచూ గొడవలకు దిగుతున్నారని, వెంటనే బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఇసురుబాయి, కాంతమ్మ, కమల, సరస్వతి, తానుబాయి, అనసూయ, చంద్రకళలతో పాటు 30 మంది మహిళలు పాల్గొన్నారు.