మంచిర్యాలటౌన్, జూన్ 9 : లైవ్ డ్రాయింగ్ పేరిట దేశాన్ని చుట్టేసి వచ్చిన చెన్నూరు పట్టణానికి చెంది న కళాకారుడు ఏల్పుల పోచన్నకు ఆదివారం మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఘన స్వాగతం లభించింది. 2017 డిసెంబర్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి యా త్ర ప్రారంభించిన ఆయన ఈ నెల 7న ముగించాడు. మంచిర్యాల రైల్వే స్టేషన్కు రాగానే ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
పూల మాలలు, శాలువాలతో సతరించారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది మన్ననలు పొంది తెలంగాణకే గొ ప్ప ఖ్యాతిని తీసుకువచ్చాడంటూ పోచం గురువు మ ద్దూరి రాజన్న అన్నారు. నడుస్తూ, సైకిల్, బైక్, రైళ్లలో 30,700 కిలోమీటర్లు ప్రయాణించారని తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు కోరల్ల రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పూద రి ప్రభాకర్, తిరుపతి, బద్రి శ్రీనివాస్, వర్మణి వెంకటేశ్వర్లు, గంగాధరి రాజు, మల్లేశ్, తోట సదానందం, రా జు, కుర్మా రాజేశ్వర్ గౌడ్, బోయిని మోహన్ యాదవ్, సుందిళ్ల రమేశ్, కమలాకర్, సమ్మయ్య, రాంబాబు, డోలక్ సమ్మయ్య, సాగర్, కిరణ్, పవన్ ఉన్నారు.