జైనూర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం గౌరీ గ్రామంలో గల జైనూర్- లింగాపూర్ రహదారి మధ్యలో ఉన్న వంతెనను హై లెవెల్( High level ) వంతెనగా నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ( Collector Harita ) అన్నారు. బుధవారం ఆమె లోలెవల్ వంతెనను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు లోలెవెల్ వంతెన ఉండటం వల్ల వర్షాకాలంలో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, హై లెవెల్ వంతెన నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.