కుంటాల : మండలంలోని ఓలా గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను (Fire victims) ముధోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ (Narayana Rao) శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు .
అనంతరం అంబుగాం గ్రామంలోని ప్రముఖ పారిశ్రామికవేత సుదర్శన్ పటేల్ మాతృమూర్తి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఓలా గ్రామంలోని పాత్రికేయుడు రామేశ్వర్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం పరామర్శించారు. ఆయన వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, మాజీ ఎంపీపీ భోజరం పటేల్, రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ మధు, కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, బెజ్జంకి ముత్యంరెడ్డి, యూనిస్, శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.