ఎదులాపురం, మే 4 : ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్మికుల హకులను కాలరాసే విధంగా అవలంబిస్తున్న విధానాలు సరికావని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఏడబ్ల్యూయూ వ్య వసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన మద్ద తు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాధి హామీ కార్మికులకు సం ఘీభావం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ మేరకు మాజీమంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. ఉపాధి హామీ కార్మికుల హకులను సాధించే దిశగా చేపడుతున్న పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ఈనెల 15న తలపెట్టిన బంద్కు పూర్తి సహకారం అందిస్తామని పేరొన్నారు. ఈ ధర్నాలో నాయకులు లంక రాఘవులు, దర్శనాల మల్లేశ్, అన్నమొల్ల కిరణ్, దత్తు, మెట్టు ప్రహ్లాద్, కొండ గణేశ్, దమ్మపాల్ పాల్గొన్నారు.