ఎదులాపురం, మార్చి 1: ప్రజలకు మెరుగైన సేవలందించాలని రిమ్స్ సిబ్బందిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఈ నెల 3న మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలిం చారు. రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం, రూ. 75 లక్షలతో రిమ్స్ దవా ఖానలో రేడియోలజీ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు మంత్రులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలకు అందుతున్న వై ద్య సేవలపై ఆరాతీశారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ ఆవరణలో పారిశుధ్య లోపం లేకుండా చూసుకో వాలని మున్సిపల్ కమిషనర్ శైలజను ఆదేశించారు. అనంతరం ల్యాబ్ శంకుస్థాపన స్థలాన్ని , రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలోని పలు వై ద్య విభాగాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రి మ్స్ సూపరింటెండెంట్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో ఎం. శ్రీకాంత్, సూపర్‌స్పెషాలిటీ దవాఖాన పర్యవేక్షకులు డాక్టర్లు కల్యాణ్‌రెడ్డి, ఇద్రిస్అక్భానీ, మాతా శిశు సంరక్షణ ప్రో గ్రాం అధికారి నవ్యసువిధ, పవన్ కుమార్, డీఎం వో మెట్పెల్లివార్ శ్రీధర్ తదితరులున్నారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మె ల్యే జోగు రామన్న పరిశీలించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో పలు వార్డులు, ఆపరేషన్ థియేటర్లను సందర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జై సిం గ్, సూపరింటెండెంట్ అశోక్, డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు విజ్జగిరి నారాయణ, వైద్యులు ఉన్నారు.