సీసీసీ నస్పూర్, ఆగస్టు 15 : కార్మికుల సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ కాలనీలో టీబీజీకే ఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. దివాకర్‌రావు బర్త్‌డే సం దర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీబీజీకేఎస్ ఆధ్వర్యం లో తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టారని, సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపించారని గుర్తు చేశా రు.
ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియర్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, నాయకులు పానుగంటి సత్తయ్య, పెట్టం లక్ష్మణ్, గడ్డం మహిపాల్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, పొగాకు రమేశ్, అత్తి సరోజ, వంగ తిరుపతి, బేర సత్యనారాయణ పాల్గొన్నారు.