మంచిర్యాల అర్బన్, మార్చి 24 : యూనివర్సల్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నదని చైర్మన్ వీ.వినయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ బ్యాంక్‌లో యూనివర్సల్ కో ఆపరేటీవ్ అ ర్బన్ బ్యాంక్ 47వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2024-25 అర్ధ వార్షిక సంవత్సరంలో రూ.48.28 లక్షలు(ఆడిట్ కానిది) నికర లాభం వచ్చిందన్నారు.
మంచిర్యాల, సీసీసీల్లో ఏటీ ఎం సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు ఇతర బ్యాంకుల కన్నా డిపాజిట్లపై ఎకు వ వడ్డీ ఇస్తున్నామని, బ్యాంకుకు రాలేని వారికి ఇంటికెళ్లి సేవలు అందిస్తున్నామన్నారు. బ్యాంకు ప్రగతి కోసం సహాయ సహకారా లు అందిస్తున్న వాటాదారులు, ఖాతాదారులు, రిజర్వ్ బ్యాంక్, సహకార శాఖ, మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం బ్యాంక్ ఇన్చార్జి సీఈవో కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ త్వరలో భూపాలపల్లి, గోదావరిఖనిలో బ్రాంచీలు నెలకొల్పుతున్నామని, చిన్న, మధ్య తరగతి ప్రజలకు రుణ సదుపాయం కల్పిస్తూ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. బ్యాంకు వైస్ చైర్మన్ జీ.పూర్ణచంద్ర రావు, డైరెక్టర్లు కేఎస్ఎం రావు, జీ.కృష్ణమూర్తి, శ్రీదేవి, బక్కయ్య, ప్రసాదరావు, రాజలింగు, భానుప్రకాశ్, రత్నం, సుశీల, భాగ్యలక్ష్మి, ఆదిత్య , శ్రీపతి శ్రీనివాస్, వాటాదారులు పాల్గొన్నారు.