కౌటాల, మే 1 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లిలోని ఎస్సీ కాలనీలో ‘తాగు నీటి కష్టాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ పత్రికలో ఏప్రిల్ 30న కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు వెంటనే గ్రామంలోని ఎస్సీ కాలనీలోని 30 కుటుంబాలకు ప్రతి రోజూ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.
కాలనీలోని చేతి పంపులో మంచినీటి బావుల్లో నీరు అడుగంటి పోవడంతో సమస్య తలెత్తినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి జుమ్డి అశోక్ తెలిపారు. వేసవి ముగిసేవరకూ తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పారు.