వాంకిడి : వరంగల్( Warangal ) జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ( BRS ) రజతోత్సవ పండుగకు ఆదివారం వాంకిడి ( Wankidi ) మండల అధ్యక్షులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీగా కదిలారు. మండలంలోని 28 గ్రామ పంచా యతీల సుమోలు , ఇతర వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముందు మండల కేంద్రంలో అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
కేసీఆర్ ( KCR ) నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేకతతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారీ మెజారిటీతో విజయం సాధించినుందని తెలిపారు.
కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జాబురే పెంటూ, మాజీ సర్పంచ్ బండె తుకారాం, సీనియర్ నాయకులు అశోక్ మహుల్కర్, మాజీ ఎంపీటీసీ పెట్కూలే వినోద్ , పార్టీ యువజన విభాగం అధ్యక్షులు రాకేష్, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షులు వీర్మిల్ల వినోద్ , నాయకులు సోను, తులసిరాం, రాము, రవి, శ్రీకాంత్, రాజ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.