మంచిర్యాల టౌన్ : ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver jubilee) సభను విజయంతం చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల నాయకులు విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వార్డులు, గ్రామాల్లో వాల్ పెయింటింగ్లు (Wall writing ) రాయించారు.
బుధవారం మంచిర్యాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్( Vijeet Kumar) ఆధర్యంలో జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద స్వయంగా ఆయన వాల్ రైటింగ్ చేశారు. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని అభిమానులు,నాయకులు పెద్ద సంఖ్యంలో సభకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.