బోథ్, నవంబర్ 7 : తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, మర్లపెల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, ఎల్క రాజు, ప్రవీణ్, డీ నారాయణ, ఎర్రప్ప, వెంకట రమణగౌడ్, రఫీ, ఎస్ వెంకట రమణ, సోలంకి సత్యనారాయణ, వాహిద్, మహిళలు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేద్దాం
బజార్హత్నూర్, నవంబర్ 7 : బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటేయాలని పార్టీ సీనియర్ నాయకుడు అల్కె గణేశ్ కోరారు. మంగళవారం మండలలోని దేగామ, మోహద, బజార్హత్నూర్ గ్రామంలోని ముత్యంపేట, జవహర్‌నగర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు నానం రమణ, చిల్కూరి భూమయ్య, కొత్త శంకర్, చట్ల గజ్జాయ్య, సాయిచైతన్య, భగత్ వినోద్, సాయన్న, మల్లేశ్, శ్రీనివాస్, విలాస్, జాంసింగ్, దనగరి రాములు, ప్రశాంత్, దిశీ రమణ, మడిగే రమేశ్, ఎడ్ల లింగన్న,తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమం
భీంపూర్, నవంబర్ 7 : అన్ని వర్గాల సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. మండలంలోని వడూర్, గుంజాల గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుంజాలలో దండారీలతో కలిసి ఆడారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్‌లు హనుమద్దాసు, ఆత్రం లక్ష్మి, బాదర్, లింబాజీ, కృష్ణ, నాయకులు నరేందర్‌యాదవ్, ధరమ్‌సింగ్, ఎం కల్చాప్యాదవ్, మార్సెట్టి అనిల్, జహూర్అహ్మద్, రాథోడ్ ఉత్తమ్, సంజీవ్‌రెడ్డి , జాదవ్ రవీందర్, పెంటపర్తి లస్మన్న, రెడ్డి దేవన్న, శ్రీను, షేక్ అఫ్రోజ్, అశోక్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్ మండలంలో..
గుడిహత్నూర్, నవంబర్ 7 : మండలంలోని గుడిహత్నూర్, సీతాగోంది, కమలాపూర్, అర్కాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు సర్పే సోంబాయి, ఆడె శీల, జాదవ్ రమేశ్, బేర దేవన్న, జాదవ్ భీంరావ్, జమీల్, జంగు, ప్రతాప్, ససానే సిద్ధార్థ్, దోమకొండ సుధాకర్, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
సొనాలలో..
సొనాల, నవంబర్ 7 : బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ యువ నాయకులు సొనాలలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అభిలాష్, హరీశ్, సుగుణాకర్, సుధీర్ రెడ్డి, భీంరావ్ పాటిల్, నరేందర్, సాయికృష్ణ, సోమన్న, మహేశ్, రాజు, ప్రశాంత్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సొనాల మండలంలో..
సొనాల, నవంబర్ 7 : సొనాల మండలంలోని మహదుగూడ, వజ్జర్, కేశవ్గూడ, లేండిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్‌లు భూమిబాయి, కిషన్, ఉపసర్పంచ్లు దేవరావ్, తులసీరాం, బీఆర్ఎస్ నాయకులు అభిలాష్, రోహిదాస్, హరీశ్, సుగుణాకర్, గౌతమ్ రెడ్డి, సాయికృష్ణ, సాయికృష్ణ రెడి,్డ నరేందర్, సోమన్న, అమృత్‌రావ్, రాజు, ఈశ్వర్, మృణాల్ గౌడ్, సంతోష్, ప్రశాంత్, శ్రీకాంత్, శ్రీనివాస్, మోతీరాం, తదితరులు పాల్గొన్నారు.
హామీలు నమ్మి మోసపోవద్దు
తాంసి, నవంబర్ 7 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి సూచించారు. మండలంలోని గోట్కురి, సావర్గాం గ్రామాల్లో వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ- రఘుతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మునేశ్వర్ భరత్, వెంకన్న, స్వప్న రత్న ప్రకాశ్, సదానందం, బీఆర్ఎస్ మండల నాయకులు రజనీకాంత్ రెడ్డి, అరుణ్‌కుమార్, సిరిగిరి దేవేందర్, లింగారెడ్డి, మహేందర్, వెంకటరమణ, కాంత్ రెడ్డి, కోరుట్ల స్వామి, రమేశ్, స్వామి, వైస్‌ఎంపీపీ ముచ్చ రేఖ- రఘు, విలాస్, వెంకటరమణ, డైరెక్టర్ చంద్రన్న, చిన్నయ్య, సంజీవ్, అరుణ్‌కుమార్, మల్లయ్య, అండె ఆనంద్, రాంరెడ్డి, పొచ్చన్న, ఆశన్న, నరేందర్, విలాస్, శంకర్ పాల్గొన్నారు.
సుంకిడిలో..
తాంసి(తలమడుగు), నవంబర్ 7 : తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్, నాయకులు జాదవ్ అజయ్, ప్రకాశ్, వెంకన్న, ప్రసూన్, నర్సింహులు పాల్గొన్నారు.
సాయం చేసే సర్కారుకు అండగా నిలవాలి
నేరడిగొండ, నవంబర్ 7 : అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కారుకు ప్రజలంతా అండగా నిలవాలని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని పార్టీ మండ ల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఎంపీపీ రాథోడ్ సజన్ కోరారు. మండలంలోని వడూర్, బోందిడి, రేంగన్వాడీ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో నేరడిగొండ వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు భీంరెడ్డి, సయ్యద్ జహీర్, సర్పంచ్ విశాల్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.