నార్నూర్ : సామాజిక సేవలో జాతీయ సేవా పథకం ( National Service Scheme) వాలంటీర్లు ముందుండాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మహాగావ్ పంచాయతీ పరిధిలోని సేకుగూడ గ్రామం రైతు వేదిక పరిసర ప్రాంతాలలో వాలంటీర్లు శనివారం పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి మాట్లాడుతూ జాతీయ సేవ పథకం శీతాకాలం శిబిరాలు ప్రారంభమయ్యాయని, వారం రోజులపాటు వాలంటీర్లు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేస్త్రం భీంబాయి, కళాశాల ప్రిన్సిపల్ వెంకట కేశవులు, మల్కు పటేల్, అధ్యాపకులు వెంకటరమణ, జలేంధర్, వాలంటరీలు ఉన్నారు.