ఆదిలాబాద్ : విద్యుత్ కోతలతో రైతులతో పాటు గ్రామస్థులు సతమతమవుతున్నారు. అప్రకటిత కోతలకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్స్టేషన్ ( Power Substation ) ఎదుట గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.
విద్యుత్ అధికారులు గంటల తరబడి కరెంటు తీసివేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఎండాకాలంలో ఉక్కపోతతో పాటు దోమల బారినపడి అనారోగ్యం అవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.