గాదిగూడ : ఉచితంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను (Health Camps) గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని గ్రామపంచాయతీ పరిధిలోని కొలాం గూడలో ఝరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎడ్యుకేటర్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో వైద్య నిపుణులతో వివిధ రకాల వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది జంగుబాయి, సావిత్రిబాయి, గ్రామస్థులు పాల్గొన్నారు.