బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో అక్రమ మద్యం బాటిళ్లను గ్రామస్థులు ధ్వంసం(Liquor Bottle Destroy) చేశారు. గ్రామంలో మద్య నిషేదం ఉందని, కొందరు గుట్టు చప్పుడుగా మద్యం అమ్ముతుండడంతో గ్రామస్థులు ఏకమై శుక్రవారం పట్టుకున్నారు. పట్టుకున్న పట్టుకున్న బాటిళ్లను గ్రామం మద్యలో ధ్వంసం చేశారు.
గ్రామస్థులందరి సహకారంతో గ్రామంలో ఎవరూ కూడా మద్యం విక్రయించరాదని మద్య నిషేదం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఎక్సైజ్, పోలీస్ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. అయినా కూడా గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగుతుండడంతో దుకాణాల్లో నిల్వ ఉంచి మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.