బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ (Bazarhathnoor) మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయానికి (శివాలయం) చెందిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు మానవత్వన్ని చాటుకొని డబ్బు వాయిద్యాల నడుమ ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 20 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన సబ్బిడి పుష్పలత, నందు కుటుంబ సభ్యులకు చెందిన అవును మహాదేవుని మందిరానికి విరాళంగా అందించారు.
అప్పటి నుంచి అది 16 దూడలకు జన్మనించ్చింది. 20 ఏండ్లుగా ఆలయ సేవలో ఉన్న ఆవు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అంతా ఏకమై మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా అంతిమయాత్రగా వెళ్లి ఆలయ ప్రాగాణంలో దహన సంస్కారాలు చేశారు.