మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేళతాళాలతో శోభాయాత్రగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించారు.
జమ్మి ఆకు ఒకరికొకరు ఇచ్చుకుంటూ అలయ్‌బలయ్ తీసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే రామ్‌లీలా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాగా, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 13 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు, డీపీపీ భాస్కర్, ఎమ్మెల్యే సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్లొన్నారు. విశ్వనాథ ఆలయంలో అమ్మవారి రథానికి పూజ చేసి, ప్రారంభించారు. గోదావరి తీరాన గల గౌతమేశ్వర ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు.
కమిషనరేట్ కార్యాలయంలో సీపీ శ్రీనివాస్ అయుధ, వాహన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గామాతకు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అదనపు డీసీపీ అడ్మిన్ రాజు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ బన్నీలాల్ ఆధ్వర్యంలో ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. అలాగే హమాలీవాడ కట్టపోచమ్మ ఆలయం వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శమీ వేడుకలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నగర్ కా ర్యవాహ పర్వతాల నర్సయ్య, బాపూజీ, కర్ణకంటి రవీందర్, ప్రతా ప్, రామగిరి శ్రీనివాస్, గుడి మల్లేశ్, సంఘర్ష్ శర్మ, సందేశ్ గుప్తా, ఉస్కమల్ల శంకర్, సంజీవ్, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, అక్టోబర్ 13 : పట్టణంలోని బాలగంగాధర్ తిలక్‌స్టేడియంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రామ్‌లీలా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయన సతీమణి రమతో కలిసి ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంతో పాటు తాండూర్, బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, రెబ్బెన మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంతకుముందు కోదండ రామాలయం వద్ద దుర్గామాత శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య, తాండూర్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మందమర్రి, అక్టోబర్ 13 : దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రాంలీలా కార్యక్రమంలో సప్త వ్యసనాల రాక్షస విగ్రహ దహన కార్యక్రమాన్ని మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, అధికారులు, యూనియన్ నాయకులతో కలసి ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశా రు. మందమర్రి సీఐ శశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సింగరేణి అధికారులు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు సలేంద్ర సత్యనారాయణ, మల్లేశ్, సుదర్శన్, సమ్మయ్య, దేవి భూమయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, అక్టోబర్ 13 : గుడిపేటలోని ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ వెంకట్రాములు దంపతులు దుర్గాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ, వాహన పూజలు చేశారు. సాయంత్రం దసరా సంబురాలు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలుచేశారు. బెటాలియన్ ముంద ఏర్పాటు చేసిన రావణుడి బొమ్మను కమాండెంట్ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేశ్, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారం, అక్టోబర్ 13 : జన్నారం మండలంలోని 29 జీపీల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పొనకల్ మాజీ సర్పంచ్, జక్కు భూమేశ్, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బాలసాని శ్రీనివాస్‌గౌడ్, ప్రజలు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, అక్టోబర్ 13 : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-8 కాలనీలోని యువ శక్తి మండపం వద్ద కౌన్సిలర్ పూదరి కుమార్ దంపతులు పూజలు శమీ పూజలు చేశారు. ఆర్కే-6గనిపై మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో జీఎం సంజీవరెడ్డి-రాధాకుమారి దంపతులు పూజలు శమీ పూజలు నిర్వహించారు. జీఎం, శ్రీధర్, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, పిట్ కార్యదర్శి సంగం సదానందంను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. సీనియర్ పీవో సునిల్‌కుమార్, టీబీజీకేఎస్ నాయకులు పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, అక్టోబర్ 13 : లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ సతీశ్ సమక్షంలో పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో ఆయుధాలతో పాటు, వాహన పూజ లు నిర్వహించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో జమ్మి చెట్టు కు పూజలు చేశారు. ఎస్ఐ-2లు రామయ్య, పనాస రాజయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక సాంబశివాలయం నుంచి పల్లకీ సేవ నిర్వహించారు.
నెన్నెల, అక్టోబర్ 13 : మండలంలో ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది ఆయు ధ పూజలు చేశారు. మండపాల వద్ద దుర్గామాతకు పూజలు చేసి, ఆదివారం శోభాయాత్ర అంగరంగా వైభవంగా నిర్వహించారు.
తాండూర్, అక్టోబర్ 13 : తాండూర్ మండల కేంద్రంతో పాటు, అన్ని గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాదారం టౌన్షిప్లో అమ్మవారి నిమజ్జన ఊరేగింపు భక్తుల కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాదారంలో జమ్మి చెట్టు వద్ద బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్-ఉమారాణి దంపతులు, నాయకులు పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు శమీ పూజలు చేశారు. రావణ దహనం నిర్వహించారు. తాండూర్, మాదారం పోలీస్స్టేషన్లలో సీఐ కే కుమారస్వామి, ఎస్ఐలు డీ కిరణ్‌కుమార్, సౌజన్య ఆయుధ పూజ చేశారు.
చెన్నూర్ టౌన్, అక్టోబర్ 13 : పట్టణంలో సాయంత్రం పట్టణ ప్రజలు స్థానిక శనిగకుంట వరకు భాజాభజంత్రీలతో తరలివెళ్లారు. మారెమ్మ గుడి వద్ద జమ్మి చెట్టుకు విజిగిరి సందీప్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక శివాలయం, జగన్నాథాలయం, హనుమాన్తో పాటు, అయ్యప్ప, సాయిబాబా ఆలయాలకు వెళ్లారు.
జైపూర్, అక్టోబర్ 13 : జైపూర్ మండలంలోని గ్రా మాల్లో ఆలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన జమ్మి చెట్లకు పూజలు చేసి విజయదశమి వేడుకలు ప్రారంభించారు. ఇందారంలో నిర్వహించిన వేడుకల్లో బేతాలుడుకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఎత్తి వేడుకలను ప్రారంభించారు.
వాంకిడి, అక్టోబర్ 13 : వాంకిడి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విజయదశమి వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. తమ వాహనాలకు పూజలు చేశారు.
రెబ్బెన, అక్టోబర్ 13 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌లో గల భీమన్న క్రీడామైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కోదండరామాలయం నుంచి శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకవచ్చి, మైదానంలో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్ద జీఎం శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు.
రెబ్బెనలో ఎల్లమ్మదేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా, దహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఎస్వోటూ జీఎం రాజమల్లు, ఐఈడీ అధికారి ఉజ్వల్కుమార్బెహరా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సభ్యుడు సంగెం ప్రకాశ్‌రావు, ఆలయ కమిటీ కార్యదర్శి శేషు, కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, అక్టోబర్ 13 : కౌటాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మధూకర్ ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఒకరికొకరు ఇస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కౌటాల, తలోడి, ధునర్హెట్టి, నాగెపల్లి, గురుడుపేట, బోదంపల్లి గ్రామాల్లో బతుకమ్మ ఆటలు ఆడారు.
దండేపల్లి, అక్టోబర్13 : గూడెం శ్రీ సత్యనారాయణస్వామి, శ్రీదత్తసాయి ఆలయాల్లో శమీపూజలు ఘనంగా నిర్వహించారు. దత్తసాయిబాబా ఆలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, గూడెం ఆలయ ముఖ్య అర్చకులు గోవర్దన రఘుస్వామి, సంపత్‌స్వామి, వేదపారాయణదారు నారాయణశర్మ, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముత్యంపేట, దండేపల్లి, మేదరిపేట, తాళ్లపేట మటన్, చికెన్ సెంటర్ల వద్ద ఉదయాన్నే జనాల రద్దీ కనిపించింది.
కాసిపేట, అక్టోబర్ 13 : దేవాపూర్, స్టేషన్ పెద్దనపల్లిలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమగూడెం భరత్ కాలనీ, కాసిపేట, ముత్యంపల్లి, పెద్దనపల్లి, కొండాపూర్, ధర్మారావుపేట, సోనాపూర్, దేవాపూర్, పల్లంగూడ, మల్కేపల్లి, కోమటిచేను గ్రామాల్లో జమ్మి చెట్టుకు పూజలు చేశారు.
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 13 : వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు వజ్జల శిరీష్ శర్మ, సాయినగర్‌లోని దుర్గాదేవి మండపం వద్ద నిమ్మకంటి సంతోష్ శర్మ, జనకాపూర్లోని కోదంద రామాలయంలో అర్చకుడు వినాయక్, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో శమీ పూజలు నిర్వహించారు.
శ్రీరామచంద్రుడి ఎంపిక కోసం, బంగారం లకీ విజేత (శ్రీనివాస్) ఎంపికను భక్తుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణ సీఐ సతీశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్, కోశాధికారి పిన్న వివేక్, ఉపాధ్యక్షుడు మురళీధర్ గౌడ్, డాక్టర్ రమేశ్, కమిటీ ప్రముఖులు ఎకరాల శ్రీనివాస్, గడ్డల వెంకటేశం, వనం మధూకర్, రాధాకృష్ణ చారి, చిలువేరు వెంకన్న, సాయిని రాజశేఖర్, ప్రహ్లాద్, జీవన్, సుధాకర్, నారాయణమూర్తి, కోట వెంకన్న, లక్ష్మణమూర్తి, గోపాల్ నాయక్, ఉదయ్, తిరుపతి పాల్గొన్నారు.
కోటపల్లి, అక్టోబర్ 13 : కోటపల్లి మండల కేం ద్రంతో పాటు, చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు ఊరేగింపుగా శమీ వృక్షం దగ్గరకు తరలివెళ్లి, పూజలు నిర్వహించారు. ఒకరికొకరు అలయ్-బలయ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ చేశారు.
కాగజ్‌నగర్, అక్టోబర్ 13 : కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్‌పై కాగజ్‌నగర్ డీఎస్పీ రామనుజం, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు రావణ దహనం చేశారు. ముందుగా శమీ పూజ నిర్వహించారు. త్రిశూల్ పహాడ్‌పై హిందూ ఉత్సవ కమిటీ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సీఐ శంకరయ్య, ఎస్ఐలు సుధాకర్, రమేశ్, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, భక్తులు పాల్గ్గొన్నారు.