తాండూర్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్ (Science Fair ) పోటీల్లో విద్యాభారతి ( Vidya Bharati ) ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ అంశాల్లో ప్రతిభను చాటారు. నీటిని పొదుపు చేయడం ఎలా అనే అంశంపై నిర్వహించిన పోటిలో జూనియర్ విభాగంలో పి వినయ్ అనే విద్యార్థి ఉత్తమ ప్రదర్శనతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు.

ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం ఎలా అనే అంశంపై నిర్వహించిన పోటీలో సీనియర్ విభాగంలో ఈ శాన్విలక్ష్మి అనే విద్యార్థిని రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశంసపత్రాలు పొందిన విజేతలను పాఠశాల డైరెక్టర్ సురభి శరత్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ సురభి సామ్య, ప్రిన్సిపల్ సరోజిని, సైన్స్ విభాగం ఉపాధ్యాయులు అభినందించారు.