తాండూర్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్( Tandur ) మండలంలో సీనియర్ క్రికెట్ క్రీడాకారులు వినూత్న ఆలోచనతో పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని మాదారం పోలీస్ స్టేషన్ మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. దాదాపుగా 20ఏళ్ల క్రితం వరకు క్రికెట్ ఆడిన మండలంలోని క్రీడాకారులందరూ కలిసి వెటరన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ( Veteran Cricket League ) పేరుతో పోటీలు నిర్వహించారు.
40 ఏళ్లు దాటిన ఆటగాళ్లు సుమారు 60 మంది 4 జట్లుగా వీడిపోయి పోటీ పడ్డారు. సోమవారం ఫైనల్ పోరు నిర్వహించనున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. మండలంలోని పలువురు సీనియర్ క్రికెట్ అభిమానుల ఆలోచనతో పూర్వ క్రికెట్ ఆటగాళ్లను కలిపేలా టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న అప్పటి ఆటగాళ్లు వచ్చి పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు .