RGUKT | నిర్మల్ : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసరలో మహబూబ్నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్సీసీ కోటాలో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీధర్షన్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
స్పోర్ట్స్ , ఎన్సిసి విభాగాల అధికారుల సమక్షంలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని పేర్కొన్నారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.