చింతలమానేపల్లి, ఏప్రిల్ 5 : మండలంలోని రవీంద్రనగర్-1,2 బాబాపూర్ గ్రామాల్లో సీఐ సాధిక్ పాషా ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, టీఎస్ఎస్పీ సిబ్బందితో ప్రధాన రహదారి గుండా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
భయాబ్రాంతులకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం రవీంద్రనగర్-1 మార్కెట్ ఏరియాలో వాహనాల తనిఖీ చేశారు. వాహనదారులకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించారు. ఎస్ఐ నరేశ్, ఏఎస్ఐ యాదవ్, 40 మంది టీఎస్ఎస్పీ సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.