
బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఓ ఇంట్లోకి వాహనం దూసుకెళ్లగా .. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని రంఖం గ్రామంలో గురువారం గ్రామంలోని ఎం. శ్రీరామ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రమాదవశాత్తు మ్యాక్స్ పిక్ ఆప్ వాహనం ఒక్కసారిగా దూసుకొచ్చింది . ఈ సంఘటనలో శ్రీరామ్ ఇల్లు ధ్వంసం కావడంతో పాటు శ్రీ రామ్ భార్య గిరిజకు స్వల్ప గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్ సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారికి పరిశీలించి బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న బేల ఎస్ఐ కల్యాణ్ అక్కడికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.