తాండూర్ : ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం మంచిర్యాల జిల్లా తాండూర్ పశువైద్యశాలలో పెంపుడు శునకాలకు ( Pet Dogs ) ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాల(Vaccinations) కార్యక్రమం పశు వైద్యాధికారి పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం యజమానులకు పెంపుడు కుక్కల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సూచనలు చేశారు.
ప్రతి యజమాని తమ పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలని, కుక్కలను బయటికి తీసుకెళ్ళేటప్పుడు వాటి నోరు మూసి ఉండేలా మౌత్ గ్యాగ్ పెట్టాలన్నారు. పెంపుడు కుక్కల వల్ల ఇరుగు పొరుగు ఇళ్ల వారికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది గౌస్, రాధిక, దుర్గం కళ్యాణ్, అన్నం మల్లేష్ పాల్గొన్నారు.