దండేపల్లి/నెన్నెల/జన్నారం/వేమనపల్లి/కన్నెపల్లి/హాజీపూర్, డిసెంబర్ 7 : జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు నష్ట పోవాల్సి వచ్చిం ది. దండేపల్లి మండలం తాళ్లపేటలో శనివారం వర్షం పడగా, పలుచోట్ల ధాన్యం తడిసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. నెన్నెలలో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కుప్పల చుట్టూ నీరు నిల్వకుండా కాలువలు తవ్వారు. ఇక చేల ల్లో ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసింది. దూది రంగు మారి ధర రా కుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జన్నారంలోని మా ర్కెట్ యార్డులో గల ధాన్యం కుప్పల్లోకి వరద వచ్చి చేరింది. తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలని రైతులు జూనుగూరి మల్లయ్య, జాడి గంగాధర్ కోరారు. శనివారం సాయంత్రం కూడా వర్షం పడడంతో రైతులు ధాన్యం తడవకుండా కవర్లు కప్పుకున్నారు. వేమనపల్లి మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లోని ధాన్యం, చేలల్లోని పత్తి తడిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కన్నెపల్లి, హాజీపూర్ మండలాల్లోనూ వర్షానికి రైతులు నష్టపోవాల్సి వచ్చింది.