ఖానాపూర్ రూరల్, జూన్ 14 : అత్తింటి వేధింపులు భరిం చలేక ఓ వివాహిత ఆత్మహత్య కు పాల్పడింది. ఈ ఘటన ఖానాపూర్ మండలలోని పాత ఎల్లాపూర్‌లో చోటు చేసు కున్నది. ఇన్చార్జీ సీఐ గోవర్ధన్, ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండుగుల శైలజ అదే గ్రామానికి చెందిన అల్లెపు రాజేశ్ మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో రాజేశ్ తల్లి అల్లెపు లక్ష్మీ, శైలజలు ఉండేవారు. చిటికి మాటికి గొడవ చేస్తూ రోజు శైలజను వేధిస్తూ ఉండేవారు.
వేధింపులు తట్టుకోలేక శనివారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని శైలజ(19) ఆత్యహత్య చేసు కుంది. సమాచారం తెలు సుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా కొరకు మృత దేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ రాజేశ్ మీనన్ ఆసుపత్రికి వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లుపోలీసులు తెలిపారు.