నిర్మల్ : జిల్లాలోని భైంసా పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. . ఓ రెండేళ్ల చిన్నారి భవనం( Building ) పై నుంచి కింద పడి మృతి ( Child died ) చెందింది. రాజస్థాన్ నుంచి వచ్చిన మాధవ్ సింగ్ – ప్రియాంక దంపతులు భైంసా పట్టణంలోని రాహుల్ నగర్లో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు.
వీరి కుమార్తె కీర్తి (2 ) శుక్రవారం బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.