హాంగ్జౌ : ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీ సోనమ్-హిమాన్షు కాంస్యం గెలిచింది. ఫైనల్లో భారత జంట 441.2 పాయింట్లు సాధించగా చైనాకు స్వర్ణం, రజతం దక్కాయి.
ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్ ఒక స్వర్ణం, ఒక రజతంతో పాటు రెండు కాంస్యాలతో నాలుగు పతకాలు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది.