తాండూర్ : తాండూర్ మండల కేంద్రం ఐబీ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Acciden ) లో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. పాత ఆంధ్ర బ్యాంకు వద్ద సర్వీసు రోడ్డుపై ఎస్సీ కాలనీకి చెందిన నిఖిల్ అనే యువకుడు ఐబీ కేంద్రం నుంచి స్టేట్ బ్యాంకు వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నిఖిల్‌తో పాటు పులికుంట గ్రామానికి చెందిన సాయి, రాజేష్‌కు గాయాలయ్యాయ. సంఘటన స్థలాన్ని తాండూర్ ఏఎస్సై మీర్ ఉస్మాన్ అలీ, కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు.