బోథ్, మార్చ్ 10 : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు బోథ్ బస్టాండ్ కంట్రోలర్ సాయన్న తెలిపారు. బస్టాండ్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు తమ టికెట్‌పై పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన గిఫ్ట్ స్కీం బాక్సులో వేయాలని సూచించారు. మార్చి 31 వరకు స్కీం వర్తిస్తుందన్నారు. ఏప్రిల్ 2న లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందిస్తామని తెలిపారు.