బాసర, జూలై 3 : బాసర ట్రిపుల్ ఐటీ 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల జాబితాను బుధవారం హైదరాబాద్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి, వీసీ వెంకటరమణ విడుదల చేశారు. 1,500ల సీట్లకు 1,404 మందితో జాబితా ప్రకటించారు. ఇందులో అమ్మాయిలు 69 శాతం ఉండగా, సర్కారు స్కూల్స్ నుంచి 95 శాతం మంది ఎంపికయ్యారు. బుధవారం విడుదల చేసిన జాబితాలో 95 శాతం ప్రభుత్వ విద్యార్థులు ఎంపికయ్యారు. 2024-25 విద్యా సంవత్సరంలో 1500 సీట్లకు 15 వేల దరఖాస్తులు రాగా.. జాబితాను ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చిన సీజీపీఏకు 0.4 పాయింట్లు అదనంగా కలిపి ప్రాధాన్యత ఇచ్చారు.
సిద్దిపేట 330, నిజామాబాద్ 157, కామారెడ్డి 64, సంగారెడ్డి 132, కరీంనగర్ 66, రాజన్న సిరిసిల్ల 81, నల్లగొండ 61, రంగారెడ్డి 46, మెదక్ 34, వరంగల్ అర్బన్ 15, వరంగల్ రూరల్ 6, మహబూబాబాద్ 18, జగిత్యాల 35, సూర్యాపేట 46, ఖమ్మం 33, మంచిర్యాల 28, జనగాం 28, నిర్మల్ 72, జయశంకర్ భూపాలపల్లి 4, మేడ్చల్ 17, పెద్దపల్లి 20, ములుగు 12, నాగర్కర్నూల్ 6, యాదాద్రి భువనగిరి 16, భద్రాద్రి కొత్తగూడెం 7, వికారాబాద్ 2, ఆదిలాబాద్ 27, వనపర్తి 1, హైదరాబాద్ 5, జొగులాంబ గద్వాల్ 1, మహబూబ్నగర్ 8, ఓపెన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి 3, అనంతపూర్ 2, విశాఖపట్నం 2, గుంటూరు 1, కర్నూల్ 1, ప్రకాశం జిల్లా నుంచి 1 ఎంపికయ్యారు.
ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు ఈనెల 8,9,10వ తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ నెల 8వ తేదీన క్రమ సంఖ్య 1 నుంచి 500ల వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1001 నుంచి 1404ల వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు దరఖాస్తులో పొందు పర్చిన సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు తెలిపారు.