ఆసిఫాబాద్ టౌన్/నస్పూర్,సెప్టెంబర్ 10 : ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టరేట్లలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఆయాచోట్ల ఐలమ్మ చిత్రపటాలకు కలెక్టర్లు వెంకటేశ్ ధోత్రే, కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) దాసరి వేణు, మోతీలాల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒకరూ కృషి చేయాలని కోరారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు సజీవన్, వినోద్‌కుమార్, ఫ్యాక్స్ అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు కడతల మల్లయ్య, వెంకటేశం, జ్యోతిబాఫూలే సంఘం అధ్యక్షుడు శంకర్, సభ్యులు భాగ్య, లక్ష్మణ్, బాపు, నాయకులు పాల్గొన్నారు.