నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఆదివాసులు (Tribals ) ఆదివారం భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ పూజలు నిర్వహించి మహాలక్ష్మి అమ్మవారికి (Mahalakshmi pujas) మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని చిన్న, పెద్దలు, మహిళలు కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధిలో నైవేద్యాలతో తరలి వెళ్లారు.
అమ్మవారి ప్రాంగణంలో ఆదివాసులు నవధాన్యాలతో పిండి వంటకాలు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాడ మాసంలో ప్రతి ఏడాది అమ్మవారికి ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం మహా పూజలు నిర్వహిస్తామని, నవధాన్యాలతో పిండి వంటకాలు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తామన్నారు. గ్రామంలో ఎలాంటి దుష్టశక్తులు రావద్దని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంట దిగుబడి బాగా రావాలని, విష జంతువుల నుంచి పాడి పశువులను కాపాడాలని అమ్మవారిని వేడుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేస్రం రూప్ దేవ్ పటేల్, మోతిరామ్ పటేల్, సీతారామ్, ప్రభు మహారాజ్, బాదిరావు, తో డసం నాగోరావ్, గ్రామ పెద్దలు ఉన్నారు.