Adilabad | జీవో 49పై ఆదివాసీల ఆగ్రహం.. ప్రశాంతంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్
జీవో 49కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నాయి.
ఆదిలాబాద్: జీవో 49కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క దుకాణం కూడా తెరచుకోలేదు. బస్సులు కూడా నడవకపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డగించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఏజెన్సీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పెసా, ఆదివాసి చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను ఆదివాసిల హక్కులను జీవోలను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బంద్కు ఆదివాసీ తుడుందెబ్బతోపాటు ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి సీపీఎం, సీపీఐ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

