కడెం నీటిపారుదల శాఖ ఉద్యోగి రాకేశ్ మృతి
జన్నారం మండల కేంద్రానికి చెందిన తోకల రాకేశ్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాకేశ్ కడెం ప్రాజెక్టు నీటి పారుదలశాఖ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు.
- పై అధికారుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ దవాఖానలో తుదిశ్వాస
జన్నారం/కడెం, మార్చి 16: జన్నారం మండల కేంద్రానికి చెందిన తోకల రాకేశ్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాకేశ్ కడెం ప్రాజెక్టు నీటి పారుదలశాఖ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే కార్యాలయంలో సూపరింటెండెంట్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తనను వేధిస్తున్నారని శుక్రవారం తల్లి సరస్వతి, తమ్ముడు విశేష్‌కు చెప్పుకొని బాధపడ్డాడు. కాసేపటికే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జన్నారంలో ప్రాథమిక చికిత్స అందించి, కరీంనగర్ దవాఖానకు తరలించారు.
జన్నారం పోలీసులు కరీంనగర్‌లోని దవాఖానకు చేరుకొని రాకేశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ బిక్లాల్నాయక్ తెలిపారు. కాగా, రాకేశ్ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పై అధికారులు ప్రభాకర్, శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు జన్నారం అదనపు ఎస్ఐ మృత్యుంజయ సర్కార్ తెలిపారు. రాకేశ్ మృతదేహాన్ని లక్షెట్టిపేటకు తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ సతీశ్ అక్కడికి చేరుకున్నారు. బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని కుటంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, రాకేశ్ తండ్రి సురేశ్ రెండు నెలల క్రితమే గుండెపోటుతో మృతి చెందాడు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

