కాగజ్‌నగర్, సెప్టెంబర్ 22 : కాగజ్‌నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
డివిజన్లోని ఏడు మండలాల ప్రజల సౌకర్యార్థ్యం కాగజ్‌నగర్‌లో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.