హాజీపూర్, ఆగస్టు 24 : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని టీ ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని టీఎన్జీవో సంఘ కార్యాలయంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి తిరుమల్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, 317 జీవో రద్దు, నగదు రహిత వైద్య సేవలు, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనల అమలు, సీపీఎస్ రద్దు, పెన్షనర్లకు డైరెక్టరేట్ ఏర్పాటుతో పాటు మరిన్ని సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావ్, పొన్న మల్లయ్య, తిరుపతి, సతీశ్‌కుమార్, శ్రావణ్, సునీత, శావప్రసాద్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్జిల్లా, మంచిర్యాల యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.