జైపూర్, ఫిబ్రవరి 24: మండలంలోని కుందారం అటవీప్రాంతంలో ఆదివారం పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినట్లు ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్‌కుమార్ తెలిపారు. కుందారం ప్లాంటేషన్‌లో పాదముద్రలు గుర్తించినట్లు పేర్కొన్నారు. భీమారం ఆరెపల్లి గుండా కుందారం అటవీ ప్రాంతంలో సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
కుందారం రైతులు, ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని చెన్నూర్ రేంజ్ అటవీ అధికారులు భగవంతరావు, సతీశ్, శ్రీధర్ హెచ్చరించారు. పశువులను కూడా అటవీప్రాంతం వైపు వెళ్లకుండా చూడాలని తెలిపారు. పెద్దపులి సంచరించిన ప్రాంతంలో తిరుగుతూ పులికి ఎలాంటి ఆపాయం కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టారు.