మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆడ తోడు కోసం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలోకి వచ్చిన పెద్దపులి జానీ తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నెల రోజుల్లో దాదాపు 350 కిలోమీటర్లు ఈ పులి పర్యటించింది.
ఆడతోడును వెతుక్కుంటూ అడవి మొత్తాన్ని జల్లెడ పట్టింది. అన్వేషణ సఫలం కాకపోవడంతో ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి నుంచి యూ టర్న్ తీసుకున్న జానీ.. గాదిగూడ మండలం ఝరి నుంచి మహారాష్ట్రలోని పిప్పల్ కోటి మీదుగా తిప్పేశ్వర్ ఫారెస్ట్‌లోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏజెన్సీ మండలాల్లో పులి సంచరిండం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది.