దస్తూరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో సర్ ( SIR ) ప్రక్రియలో భాగంగా నోటీసులు ( SIR Notice ) అందిన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ యాదవ్‌రావు ( Tahasildar Yadav Rao ) తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 29 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో విచారణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన విచారణ తేదీన ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయానికి హాజరై సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ సూచించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.
మండలంలో మ్యాపింగ్ కాని ఓటర్లు 372 మంది ఉండగా, పేర్లు, చిరునామాల్లో తప్పులు ఉన్న ఓటర్లు 2,976 మంది ఉన్నట్లు తహసీల్దా ర్ వివరించారు. మొత్తం 3,348 మంది ఓటర్లకు నోటీసులు అందజేయ నున్నట్లు తెలిపారు. ఓటర్లు నిర్ణీత గడువులోగా విచారణకు హాజరై అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు.