‘బీసీ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి’
బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బీసీ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి...
– ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు
నల్లగొండ, సెప్టెంబర్ 15 : బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బీసీ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. బీసీల సమస్యలపై చట్టసభల్లో తన వాయిస్ ను వినిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీసీల సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయి ఉద్యమాన్ని కూడా చేపట్టాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 80 ఏండ్లు అయినా సమస్యలు పరిష్కారం కావట్లేదని, పార్టీలకతీతంగా బీసీలు అంతా ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బీసీలకు క్రిమిలేయర్ ఎత్తేయాలి
రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ నిబంధన కేవలం బీసీలకే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీసీలకు క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఏ పోస్టులో జాయిన్ అయితే ఆ పోస్టులోనే రిటైర్డ్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. దేశానికి బీసీ ప్రధాని ఉన్నా బీసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణనను చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు చింతా నాగరాజు, బీసీ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, పాలిటెక్నిక్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఆంధ్రా బీసీ నాయకులు గిర్రాజ్ రవి, నీలూరి శీనా, యుగంధర్, కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

